పద్మ అవార్డులపై దర్శకధీరుని అసంతృప్తి

January 27, 2015 | 01:01 PM | 23 Views
ప్రింట్ కామెంట్

ప్రతి యేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ పురస్కారం పద్మ అవార్డు ఈ ఏడు తెలుగు నటుడు కోట శ్రీనివాసరావును వరించింది. ఆలస్యంగానైనా ఆయనకు ఈ అవార్డు రావడంపై పలువురు తెలుగు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయమై దర్శకుడు రాజమౌళి ఆ ఆయనకు అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయమని అభినందించారు. అయితే ఎప్పటినుంచో ఈ రంగానికి సేవలందిస్తున్న ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకట రమణకు ఆ పురస్కారం దక్కకపోవడంపై రాజమౌళి అసంతృప్తిని వ్యక్తం చేసారు. దర్శకుడు బాపుతో కలసి ఎన్నో అద్భుతమైన సినిమాలకు స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు ముళ్ళ పూడి రమణ. కానీ ఇప్పటి వరకూ ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పురస్కారాలు అందలేదని అన్నారు. రాజమౌళి లాంటి పెద్ద దర్శకుడు బహిరంగంగా పద్మ అవార్డుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడంపై ఇప్పుడు సినీ రంగంలో చర్చనీయాంశం అయింది. ఆయన వ్యాఖ్యలను పలువురు సమర్థించారు. రాజకీయ రంగంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలున్న వారిని మాత్రమే ఈ అవార్డులు వరిస్తాయా? అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ