బాహుబలి సినిమాకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్ లో లీక్ అయ్యింది. ఒకరు చేసిన పనికి ఈ సీనిమా టీం అంతా అయోమయంలో, ఆందోళనలో పడిపోయింది. వెంటనే రంగgలోకి దిగిన టెక్నికల్ టీం ఆ వీడియోను ఇంటర్నెట్ నుండి క్షణాల్లో తొలగించేసారు. అయితే కొందరు ఈ వీడియోను సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా స్ప్రెడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో స్ప్రెడ్ కాకుండా బాహుబలి టీం సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన ఏ విషయమూ లీక్ కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. వీడియో లీకు వ్యవహారంపై చిత్ర నిర్మాతలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇప్పటికే పోలీసులు ఈ లీక్ వెనక గల వ్యక్తులను అరెస్టు చేసారు. వీడియోను ఎవరైనా సోషల్ మీడియా ద్వారా లీక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసారు. ఈ చిత్రానికి గ్రాఫిక్ వర్క్ చేసే ఓ కంపెనీ మాజీ ఉద్యోగి ఒకరు ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఈ 15 నిమిషాల వీడియో లీకు వల్ల సినిమాకు జరిగే నష్టం ఏమీ లేదని అంటున్నారు. ఈ వీడియో కూడా గ్రాఫిక్ వర్క్ చేయని క్లిప్పింగ్ అని తెలుస్తోంది.