సల్మాన్ సినిమా కథ తన తండ్రిదంటూ...జక్కన్న ట్వీట్లు

June 19, 2015 | 01:56 PM | 1 Views
ప్రింట్ కామెంట్
bhajrangi_bhaijan_rajamouli_niharonline

బాలీవుడ్ స్టార్ హీరోగా తెరకెక్కిన ‘బజ్రంగి భాయిజాన్' మూవీ ట్రైలర్ విడుదలైన సందర్భంగా రాజమౌళి తన స్పందనను సోషల్ మీడియాలో తెలిపారు. ‘నేను చాలా గర్వించదగిన విషయం. మా నాన్న విజయేంద్రప్రసాద్  ‘బజ్రింగి భాయిజాన్' సినిమాకు కథ రాసారు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. టీంకు నా శుభాకాంక్షలు’ అని తెలిపారు. ఈ చిత్రం జులై 17న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీస్ సిద్ధికీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్... పవన్ కుమార్ చతుర్వేది పాత్రలో హనుమంతుడి భక్తుడిగా కనిపించబోతున్నారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ