తనకి సంబంధం లేని విషయాలపై మాట్లాడి, తమ ఇమేజ్ ను డామేజ్ చేసినందుకు ప్రముఖ నిర్మాత, హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఛార్మిపై ఫైర్ అవుతున్నాడు. దీంతో అమ్మడు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కోక తప్పేలా లేదు. నితిన్‌తో పూరి జగన్నాథ్ సినిమా కాన్సిల్ అవడానికి కారణమేంటని అడిగితే, ఆ విషయం నాకు తెలియదని అనకుండా 'వాళ్ల దగ్గర సినిమా తీసే డబ్బుల్లేవంట' అని వ్యంగ్యంగా మాట్లాడిన ఛార్మిపై నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి మండి పడుతున్నాడు. తనలాంటి సీనియర్ ప్రొడ్యూసర్ గురించి అలా మాట్లాడడమేంటని ఆయన సీరియస్ అయ్యాడు. ఆయన కోప్పడిన విషయం తెలుసుకుని ఛార్మి వెంటనే సారీ చెప్పింది కానీ ఆయన మాత్రం తనని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నాడు. ఛార్మిపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన సుధాకర్ రెడ్డి ఆమెపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. ఒకవేళ చిత్ర రంగం నుంచి సరైన స్పందన రాకుంటే ఛార్మిపై పరువు నష్టం దావా కూడా వేస్తానంటున్నాడు. దీంతో ఈ వివాదం సమసిపోడానికి ఛార్మి రంగంలోకి దిగక తప్పనట్టుంది. ఆమెకు అండగా ఉన్న పూరీ జగన్నాథ్ ఈ గొడవ పెద్దది కాకుండా కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.