మహేష్ కామెంట్స్ కు ప్రతిగా జక్కన్న ప్రశంసలు

July 02, 2015 | 04:06 PM | 2 Views
ప్రింట్ కామెంట్
rajamouli_about_mahesh_babu_niharonline

వీరిద్దరూ కలిసి ఒక్క సినిమా చేసింది లేదు... ఏ సినిమా ఫంక్షన్ లోనూ కలిసినట్టు అనిపించలేదు... కానీ ఒకరినొకరు మీడియాద్వారా పొగిడేసుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషనల్ ఓ సినిమా వస్తే బాగుండునని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే... నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ‘బాహుబలి’ ప్రమోషన్ నిమిత్తం ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి తన సినిమా విశేషాలను వివరిస్తూ మధ్యలో మహేష్ బాబు పై ‘శ్రీమంతుడు’ సినిమా పై చేసిన రివర్స్ కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా మహేష్ రాజమౌళిల మధ్య ఉన్న అభిమాన పరంపరకు ఆశ్చర్యపోయారు.  ‘కొంతమంది కేవలం హాట్ న్యూస్ లు సృష్టిద్దామన్న ఉత్సాహంతో తన ‘బాహుబలి’ కి మహేష్ ‘శ్రీమంతుడు’ కి సంబంధంలేని పోటీని క్రియేట్ చేసారని అయితే అటువంటి వార్తలతో తాను కాని మహేష్ కాని ఎటువంటి కంగారు పడకుండా తమ సినిమాల విడుదలకు సంబంధించిన లేటెస్ట్ పరిస్థితిని ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటూనే వచ్చాము అన్న విషయం చాలమందికి తెలియదు’ అంటూ రాజమౌళి మహేష్ తో తనుకున్న సాన్నిహిత్యాన్ని బయట పెట్టాడు. అయితే తన ‘బాహుబలి’ ని చూసి మహేష్ భయపడి ‘శ్రీమంతుడు’ వెనక్కు తగ్గాడు అన్న మాటల పై క్లారిటీ ఇస్తూ మహేష్ హుందాగా ఇచ్చిన సమాధానం తనకు ఎంతో నచ్చిందని తోటి హీరోల సినిమాలకు మంచి జరగాలని సినిమా పరిశ్రమ బాగుండాలి అని ఆలోచిస్తున్న మహేష్ ఉద్దేశాన్ని సంకుచిత దృష్టితో చూస్తూ ‘బాహుబలి’ కి భయపడి ‘శ్రీమంతుడు’ వెనక్కి వెళ్ళాడు అని వార్తలు రాసిన వారికి పాఠం చెప్పేలా మహేష్ హుందాగా ప్రవర్తించాడు’ అంటూ మహేష్ పై ప్రశంసలు కురిపించాడు రాజమౌళి.  ‘బాహుబలి’ ‘శ్రీమంతుడు’ సినిమాలలో ఏ సినిమా విజయవంతం అవుతుంది అంటూ మరికొందరు వార్తలు రాస్తున్నారని తాను వ్యక్తిగతంగా ఈ రెండు సినిమాలు ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా’నని రాజమౌళి అన్నారు. అంతేకాదు  ఈ రెండిటిలో ఏ ఒక్క సినిమా పరాజయం చెందినా తనకు ఆనందం ఉండదని తాను పరిపూర్ణంగా ఆనందం పొందాలి అంటే ఈ రెండు సినిమాలు ఘనవిజయం పొందినప్పుడే తనకు నిజమైన ఆనందం అన్నాడు జక్కన్న. ఇంత అనుబంధ ఆప్యాయతలున్న వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ