అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. లేదంటే... అసలు అవకాశాలే లేకుండా పోతామన్నది సినీ ఇండస్ట్రీలో బాగా అలవాటైన నానుడి, నటుడు రాజశేఖర్ తీసుకున్న ఓ నిర్ణయం ఆయన సినీకెరీర్ లో ఓ మంచి అవకాశాన్ని కొల్పొయేలా చేసింది. దాదాపు పాతికేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. వెంకీ-మహేష్ కాంబినేషన్లో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మల్టీ స్టారర్ చిత్రాలకు ఊపు తేవటంతోపాటు టాలీవుడ్ టాప్ టెన్ బ్లాక్ బస్టర్లలో ఒకటి గా నిలిచింది. అయితే ఈ చిత్రం విడుదలైన రెండేళ్ల తర్వాత దీనికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో హీరోల తండ్రి పాత్ర ప్రకాశ్ రాజ్ చేసిన విషయం తెలుసుకదా. నిజానికి ముందుగా ఈ క్యారెక్టర్ కి నటుడు రాజశేఖర్ ని అనుకున్నారట. అంతేకాదు ఈ విషయమై చిత్ర నిర్మాత దిల్ రాజు ఆయనను సంప్రదించారట కూడా. అయితే తండ్రి పాత్రలో నటిస్తే హీరో పాత్రలు తగ్గిపోతాయేమోనన్న భయంతో రాజశేఖర్ ఈ ఆఫర్ ని వదులుకున్నారట. ఒకవేళ ఆయన గనుక ఆపాత్ర చేసుంటే జగపతి బాబు లా ఇప్పుడు మంచి మంచి పాత్రల ఆఫర్లు వచ్చేవేమో.