నాటకాల రాయుడిగా సూపర్ స్టార్!

March 24, 2016 | 12:32 PM | 1 Views
ప్రింట్ కామెంట్
rajinikanth-stage-play-Nadigar-Sangam-fundraising-niharonline

ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ కి వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన సినిమా ఒకటి విడుదలవుతుందంటే, ఆయా భాషలకి సంబంధించిన అగ్రకథానాయకులు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకోవడం జరుగుతుంటుంది. అంత క్రేజ్ వున్నా ఆయన ఒక సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తుంటారు .. ఒక మంచి కార్యక్రమం కోసం అందరికన్నా ముందే వుంటారు.

అలా ఒక మంచి పని కోసమే ఆయన నాటకాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారనే వార్త కోలీవుడ్లో వినిపిస్తోంది. 'నడిగర్ సంఘం' తమ భవన నిర్మాణానికిగాను, 25 కోట్ల నిధిని సేకరించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తమిళ నటీనటులంతా నాటకాలను ప్రదర్శించి తద్వారా కొంతమొత్తాన్ని సేకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలా ఈ నాటకాల్లో పాల్గొనడానికి రజనీ కూడా రెడీ అవుతున్నాడని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వలన భవన నిర్మాణానికి సహకరించినట్టు మాత్రమే కాకుండా, నాటకరంగం పట్ల ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించినట్టు అవుతుందని ఆయన భావిస్తున్నాడని అంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ