ఎవరి అద్రుష్టం ఎలా ఉంటుందో చెప్పలేం... అది కూడా సినిమా ఇండస్ట్రీ అయితే టాలెంట్ ఉన్నా ఎదుగుదల లేని నటులు ఎంతో మంది ఉన్నారు. వారు చేసిన సినిమాలు హిట్ ఇవ్వకపోతే ఐరన్ లెగ్ అంటూ వారిని కరివేపాకులా తీసి పారేస్తుంటారు. కానీ ఈ మధ్యే ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా హిట్ కావడం, పెద్ద హీరోయిన్ల డేట్లు సర్దుబాటు కాకపోవడంతో వరుసగా పెద్ద పెద్ద హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది రకుల్ ప్రీత్ సింగ్. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ తారపై రెమ్యునరేషన్ రూమర్స్ పాస్ అవడం సహజమే కదా... అలా ఈ మధ్య రకుల్ కోటి డిమాండ్ చేస్తుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ దీని వెనక కథ వేరేగా ఉందట... అది రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా చెప్పుకొచ్చింది... హీరోలతో సమానంగా హీరోయిన్స్ కు కూడా రెమ్యునేషన్ ఇవ్వాలని తాను అనుకుంటుందట.. అయితే ఒక హీరో ఓ సినిమా చేసే లోపుగా హీరోయిన్లు మూడు సినిమాలు చేస్తారు కాబట్టి రెమ్యునరేషన్ విషయంలో ఆనందంగానే ఉందంటోంది... అంటే రెమ్యునరేషన్ కోటి ముడుతున్నట్టే కదా... ఏదైతే నేమి కోటి మాట ఎత్త కున్నా బాగానే ముడుతుందని చెపుతోంది... అయితే కోటి ముచ్చట బయటికి పొక్కిన విషయం వెనుక కథ ఏమిటంటే.... నితిన్ తన తదుపరి చిత్రంలో నటించడానికి రకుల్ కు కోటి రూపాయలు ఆఫర్ చేశాడని ఓ వార్త. గతంలోనే శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో ఓ సినిమాకు రకుల్ సైన్ చేసిందట. అప్పుడా సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఆ డేట్స్ ను నితిన్ ఇప్పుడు అడుగుతున్నాడని కొందరంటుంటే... తన దగ్గర డేట్స్ ఖాళీ లేవు కాబట్టి కోటి రూపాయలను రకుల్ డిమాండ్ చేస్తోందని మరో మాట. ఏది ఏమైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగినన్ని చర్చలు మరే ఇండస్ట్రీలో ఉండవనేది వాస్తవం.