‘బాహుబలి’ పాటల గురించి....

May 21, 2015 | 12:30 PM | 54 Views
ప్రింట్ కామెంట్
bahubali_music_director_and_singers_niharonline

ఇప్పటి వరకూ రాజమౌళి తీసిన సినిమాలే కాదు... పాటలకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. సోదరుడు కీరవాణి అందించే సంగీతం ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా జూన్ 10న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండగా, మే 31న ఈ సినిమా ఆడియో విడుదల చేస్తున్నారు.  ఈ సినిమాలో మొత్తం మీద 8 పాటలున్నాయి. 11 మంది సింగర్స్ పాడారు. ఈ ఎనిమిది పాటలు కూడా 8 మంది రైటర్స్ తో రాయించారట. ఈ సినిమా ఆడియో లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతోందట. ఈ మేరకు ఈ సినిమా పార్ట్ 1 గా వస్తున్న బాహుబలి బిగినింగ్ ఆడియో రైట్స్ కోసం లహరి కంపెనీవారు దాదాపు 2.25కోట్ల రూపాయలు వెచ్చించినట్టు, ఆడియో వేడుక నిర్వహణకి కోటిన్నర వెచ్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఆడియోని శిల్ప కళా వేదికలో నిర్వహిస్తున్నారు. తెలుగు,తమిళ, బాలీవుడ్ చిత్రాలకు చెందిన ఇండస్ట్రీ ప్రముఖులు ఈ పంక్షన్ లో పాల్గొననున్నారు. కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ హాజరయ్యే అవకాసం ఉంది. అలాగే బాలీవుడ్ లో డైరెక్టర్ గా, నిర్మాతగా, సక్సెఫుల్ రియాలిటీ షో హోస్ట్ గా, తాజాగా నటుడిగా మారిన కరణ్ జోహార్ ముఖ్య అతిధిగా రానున్నారట. ఇక ఈ ఆడియోని రాజమౌళి సోదరుడు కీరవాణి అందించారు. పాటలను శివశక్తి దత్తా, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, చైతన్య ప్రసాద్, ఇనగంటి సుందర్, ఆదిత్య, నీల్ సీన్ రాసారు. ఇక పాటలు పాడింది గీతా మాధురి, దీపు, రమ్య బెహ్రా, మోహన, కార్తీక్, దామిని, సత్య యామినీ, శ్వేత రాజ్, మౌనిమ, రేవంత్, ఆదిత్య, కీరవాణి పాడారు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ