కేఫ్ ప్రారంభోత్సవంలో తళుక్కుమన్న రకుల్

July 30, 2015 | 11:58 AM | 2 Views
ప్రింట్ కామెంట్
Rakul_Preet_cafe_inauguration_niharonline

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అంటే రకుల్ ప్రీత్ సింగ్ అనే చెప్పాలి. దాదాపు అందరు పెద్ద హీరోలతో ఆమె నటిస్తోంది. ఈ అమ్మడు నిన్న (29 జులై) ఓ ఈటరీ షాప్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చింది. తమ అభిమాన తార వస్తుందనే సరికి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆమెను చూడ్డానికి అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ అదుపు చేయడం కోసం హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ వాహనదారులను చాలా ఇబ్బందుల పాల్జేశారు. కొందరిపై లాఠీ చార్జి జరిపారు. దీంతో సామాన్య ప్రజలు పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 'బహార్ కేఫ్' ను ప్రారంభించేందుకు సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్ వస్తుందని పోలీసులు ఓ రోడ్డును మూసివేశారు. దాదాపు మూడు గంటల పాటు రహదారిని మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.  సినీనటి రకుల్‌ప్రీత్ సింగ్ కోసం ప్రజలను ఇబ్బందులను గురి చేయడం తగదని అన్నారు. మరో ప్రక్క .. సినీ నటి రకుల్‌ప్రీత్ సింగ్ వస్తారన్న సమాచారంతో అభిమానులు పెద్ద ఎత్తున ఎస్‌ఆర్‌నగర్ వచ్చారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాలు మీదుగా వాహనాలను దారి మళ్లించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై నిలబడటంతో నడిచేందుకు వీలులేని పరిస్థితులు తలెత్తాయి. 
రకుల్ ప్రీతి మాట్లాడుతూ... యువతకు నచ్చే నాణ్యమైన వంటకాలను అందించినప్పుడే ఇలాంటి షాపులకు ఆదరణ లభిస్తుందని తెలిపారు. 
రాకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు జూనీయిర్ ఎన్టీఆర్-సుకుమార్ ‘మా నాన్నకు ప్రేమతో’, రాంచరణ్- వైట్ల (ఫైటర్ ఇంకా పేరు పెట్టలేదు) సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉంది.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ