రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమా టైటిల్ విషయంలో ఎన్నో పేర్లను పరిశీలించారు. కానీ చివరికి మొదట వినిపించిన బ్రూస్లీ అనే పేరు ఫిక్స్ చేశారు. అంత పవర్ ఫుల్ నేమ్ ఫిక్స్ చేసినప్పుడు ఫైట్స్ ఆ లెవెల్ లో ఉంటేనే సినిమా ఆడియన్స్ కు రీచ్ అవుతుంది. మరి ఈ పేరును ఎలా ఎంపిక చేశారనే విమర్శలు కూడా సినీ క్రిటిక్స్ నుంచి, సాధారణ ప్రేక్షకుల నుంచి కూడా వినిపిస్తున్న మాట. అయితే ఈ పేరుపై మొగ్గు చూడం పట్ల రాంచరణ్ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో తాను స్టంట్ మ్యాన్ అని, పైటింగ్స్ చేయడంతోపాటు.. బ్రూస్ లీ చిత్రాన్ని చేతిపై టాటూ వేయించుకుని కనిపిస్తానని చెప్పాడు. స్టంట్స్ కు గల ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకుని.. బ్రూస్ లీకి నివాళిగా ఈ పేరు పెట్టామన్నాడు. ఈమూవీలో యాక్షన్ సీన్స్ కు బాగా ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తోంది. ఫైట్లపై ప్రత్యేకమైన దృ,ష్టి పెట్టారట కూడా. స్టంట్స్ విషయంలో చరణ్, శ్రీనువైట్ల ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరుంజీవి హీరోగానే దర్శనమివ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈయన కూడా ఓ ఫైట్ సీన్ చేస్తాడట. ఏది ఏమైనా బ్రూస్లీ టైటిల్ అంత పవర్ ఫుల్ యాక్షన్ లో రాంచరణ్ ను చూడాలని ప్రేక్షకులు చాలా ఎక్స్ పెక్టేషన్లతో ఉన్నారు. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం షూటింగ్ చివర్లోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతారాట.