మెగా స్టార్ 150వ చిత్రానికి పూరీ జగన్నాథ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు... సినిమా పేరు ‘ఆటో జానీ’ అనీ... మీడియాలో వార్తల ప్రచారం బాగా జరిగింది. కానీ ఏమైందో కొన్నాళ్ళకు అంతా చప్పబడిపోయినట్టు కనిపించింది. చిరంజీవి ఓ సందర్భంలో మీడియా వారికి ‘ఆటో జానీ’ సెకండాఫ్ నచ్చలేదని చెప్పారు. ఇది తెలియని పూరీ చిరంజీవితో సినిమా ఉంటుందని కూడా చెప్పుకున్నారు. దీంతో హర్ట్ అయిన పూరీ చాన్నాళ్ళ తరువాత తన బర్త్ డే రోజున ఈ విషయం చెప్పి బాధ పడ్డాడు. మీడియాకు చెప్పకుండా తనకే చెప్పుంటే స్టోరీ మార్చి ఉండేవాడినని కూడా పూరీ అన్నారు. ఈ వ్యాఖ్యలతో కాస్త సినీ ఇండస్ట్రీలో దుమారం రేగడంతో చిరు తనయుడు రామ్ చరణ్ తేజ స్వయంగా రంగంలోకి దిగి పూరీని కూల్ చేసే ప్రయత్నం చేశాడట. పూరీ జగన్నాథ్ కార్యాలయానికి వెళ్లి ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పి, మీడియా ఈ విషయాన్ని ట్విస్ట్ చేసిందన్నట్టు మాట్లాడాడట. ఇందులో సర్ది చెప్పుకునే విషయం పెద్దగా ఏమీ లేదు... మీడియా ట్విస్ట్ చేసింది కూడా ఏమీ లేదు... ఏదో డైరెక్టర్ గారి అలకను తీర్చే ప్రయత్నం అంతే...