హీరో రామ్ చేతికి గాయాలు`

August 11, 2015 | 04:54 PM | 2 Views
ప్రింట్ కామెంట్
ram_injured_niharonline

ఇప్పటి హీరోలకు డూప్ లేకుండా నటించడమంటే మహా సరదా! రియాలిటీ కోసం చాలా రిస్కు లే చేస్తున్నారు. అలాగే రామ్ ఓ యాక్షన్ సన్నివేశంలో నటిస్తూ అనుకోకుండా చేతికి దెబ్బ తగిలించుకున్నాడు. వెంటనే  ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నప్పటికీ,  డాక్టర్ల సలహాను పాటించకుండా మరో రిస్కీ షాట్ లో పాల్గొనడంతో... పెద్ద రిస్కులో పడిపోయాడట. దాదాపు వారం పాటు రెస్టు తీసుకొమ్మని డాక్టర్లు సలహా ఇస్తే మళ్ళీ అదే చేత్తో ఫైట్లు చేశాడట. ఆ చేతి గాయం మరింత పెద్దదై ఏకంగా ఆరు వారాల విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది . ప్రస్తుతం హీరో రామ్ శివం చిత్రంలో నటిస్తున్నాడు . తన చేతి గాయం తాలూకు ఫోటో ని పెట్టి డాక్టర్లు చెప్పినా వినక యాక్షన్ సీన్స్ లో నటించినందుకు ఇలా జరిగిందని తన ట్విట్టర్ అకౌంట్ లో మెసేజ్ తో పాటు ఫొటోలు పెట్టాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ