జక్కన్నను ప్రశంసించడంలో పిసినారులట...

July 13, 2015 | 02:09 PM | 3 Views
ప్రింట్ కామెంట్
rajamouli_family_niharonline

రాజమౌళిని భారతదేశమంతా పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఈయన ఇప్పటి వరకూ తీసిన సినిమాలన్నీ హిట్లే... తెలుగులో నెంబర్ వన్ దర్శకుడంటే రాజమౌళి అనే చెప్పుకోవాలి. బాహుబలి సినిమా ఇటు సౌత్ అటు నార్త్‌, ఓవ‌ర్సీస్‌, టోట‌ల్ వ‌రల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.  కానీ రాజమౌళి ఇల్లాలు రమా రాజమౌళికి మాత్రం ఈ సినిమా న‌చ్చలేద‌టండీ... నమ్మలేకపోతున్నాం కదా... అది ఆ నోటా ఈ నోటా వింటే అలాగే అనుకుందుము కానీ... స్వయంగా ఈ విష‌యాన్ని రాజమౌళి గారే చెప్పారంటే ఇక నమ్మకుండా ఎలా ఉండగలం? త‌న సినిమాలు రిలీజ్ అయ్యాక వాటిని చూసిన త‌న భార్య ర‌మ కానీ, ఇతర త‌న కుటుంబ స‌భ్యులు కాని త‌న‌ను అసలు మెచ్చుకోర‌ని… ర‌మ‌తో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబ‌ర్స్ త‌న‌ను పొగ‌డ‌డంలో ప‌ర‌మ పిసినారుల‌ని… ఆయన మీడియాకు తెలిపాడు. ఇక రాజమౌళి కొడుకు కార్తికేయ, కీరవాణి కొడుకు భైరవలకు మాత్రం బాహుబలి బాగా నచ్చిందని చెప్పుకున్నారు రాజమౌళి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ