అల్లరబ్బాయి సినిమా మళ్ళీ ఆగింది...

July 13, 2015 | 01:19 PM | 3 Views
ప్రింట్ కామెంట్
james_bond_wallpapers_july_24_niharonline

అల్లరి నరేష్, సాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘జేమ్స్ బాండ్’. ఈ చిత్రం విడుదలకు ప్రతి సారీ ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతోంది. అల్లరబ్బాయి నటించిన ‘జేమ్స్ బాండ్ - నేను కాదు నా పెళ్లాం’ సినిమా గత నెల 26 న విడుదల చేయాలనుకున్నారు. కుదరలేదు. ఆ తర్వాత జులై 17న బాహుబలి విడుదలైన వారానికి విడుదల చేయబోతున్నట్టు అల్లరి నరేష్ ప్రకటించాడు. కానీ జులై 10న విడుదలైన ‘బాహుబలి’ అన్ని థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కాబట్టి కొత్త సినిమాలు, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టం అవుతుండడంతో... అందులో బాహుబలి వారం రోజుల తరువాత కూడా ప్రభంజనం చూపించే సూచనలు కనిపిస్తుండడంతో ఇక ఈ సినిమా మళ్ళీ వాయిదా వేయక తప్పలేదు. దీంతో ఈ చిత్రాన్ని జులై 24కు వాయిదా వేసారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తుంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నరేష్ భార్యగా సాక్షి చౌదరి లేడీ మాఫియా డాన్ పాత్రలో నటించింది. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ