ఎంతటి ఎత్తుకు ఎదిగినా, మరేదో చేయాలనే కోరిక ఇంకా మిగిలుతూనే ఉంటుంది. ఈ శతాధిక సినిమాల రారాజుకి కూడా మూడు కోరికలు మిగిలిపోయాయట. ఈయన మనసెప్పుడూ సినిమాల చుట్టూరానే తిరుగుతుందనడాకి ఓ ఉదాహరణ సినీ నటుడు రాజశేఖర్ తనకు ట్రీట్ మెంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడూ ఎప్పుడూ సినిమాలగురించే మాట్లాడేవారట. ఆయనకు ఆ నాటి నుంచీ ఇప్పటి వరకూ సినిమా అంటే అంత ప్రీతి. అంతటి మహానుభావుడికీ తీరని కోరకలూ మూడు మిగిలిపోయాయట. అందులో ఒకటి తాను నిర్మించిన రెండవ సినిమా రాముడు-భీముడు తిరిగి నిర్మించాలనీ, అందులో జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా తీసుకోవాలని ఆశ. దీనికి సంబంధించి చర్చలు కూడా జరిపారు. ఒక సందర్భంలో ఈ సినిమాకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే తగిన న్యాయం చేస్తారని అన్నారట. ఒకవేళ తన కోరిక తీరకపోతే అదే సినిమాను కలర్ లోకైనా మారవాలని అనుకున్నారట. ఇక యన కోరికల్లో మరొకటి దర్శకత్వం వహించటం. దాదాపు 150 సినిమాలు నిర్మించిన ఈయనకు ఒక్క సినిమాకైనా దర్శకత్వం వహించాలనే కోరిక. అదీ తీరలేదు. ఇక మూడో కోరిక తన కుటుంబంతో ఒక సినిమా నిర్మించాలని... అది కూడా తీరకుండానే ఆయన కాలం చేయడం. ఇది అభిమానులను కూడా నిరాషకు గురిచేసిందనే చెప్పవచ్చు. ‘మనం’ సినిమాలో లా మూడు తరాలను ఒకే సినిమాలో చూపించి ఉంటే బాగుండేది.