రంభ నగలు చోరీ?

February 02, 2015 | 04:23 PM | 38 Views
ప్రింట్ కామెంట్

రంభకు చెందిన బంగారు, వజ్రాల నగలను ఆమె వదిన, అక్కలు కాజేశారని రంభ సోదరుడు వై.శ్రీనివాస్ ఆరోపిస్తూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. తాము చెన్నైలోని విరుగుంబాక్కం పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. బంజారాహిల్స్ పీఎస్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన రంభకు చెందిన రూ.4.5 కోట్ల విలువైన బంగారు, డైమండ్ నగలను చోరీ చేశారన్నారు. అతడి భార్య పల్లవి, ఆమె సోదరి శాంతిసింగ్ చౌహాన్, పల్లవి సోదరుడు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రవికిరణ్, అతడి భార్య సంయుక్త వీటిని చోరీ చేశారన్నారు. రంభ మూడేళ్లుగా కెనడాలో ఉందనీ, దీంతో ఇక్కడ లేనిది చూసి వాళ్లు తన మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆయన అన్నారు. చెన్నైలో వీరిపై కేసు వున్న విషయాన్ని తాను పోలీసులకు తెలిపానని చెప్పారు. వీళ్లు తన కుమారుడిని తనకు చూపించకుండా వేదిస్తున్నారని ఆవేదన చెందారు.ఒక ఫంక్షన్‌లో పాల్గొనేందుకు రంభ కెనడా నుంచి ఇండియాకు వచ్చిందన్నారు. ఇంతకు ముందు వరకట్నం వేధింపుల్లో శ్రీనివాస్ భార్య పెట్టిన కేసులో సోదరుడు శ్రీనివాస్ తో పాటు రంభ, వారి తలిదండ్రులు వెంకటేశ్వరరావు, ఉషారాణిల పేర్లు కూడా ఉన్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ