మాజీ రాష్ట్రపతికి రాంచరణ్ సంతాపం

July 28, 2015 | 11:49 AM | 2 Views
ప్రింట్ కామెంట్
ramcharan_kalam_pic_niharonline

మన ప్రియతమ అవుల్‌ పకీర్‌ జైనులబ్దీన్‌ అబ్దుల్‌ కలాం (84) కాల ధర్మం చెందారు. ఆయన సోమవారం హఠాత్తుగా కనుమూశారు. యావద్భారత దేశాన్ని హతాశులను చేశారు. షిల్లాంగ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో సాయంత్రం 6.30కు ఉపన్యాసమిస్తూ కలాం ఒక్కసారిగా కుప్పకూలారు. సాయంత్రం 5.40కు ఆయన ఇక్కడకు చేరుకున్నారు. కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారు. 6.35కు 'లివబుల్‌ ప్లానెట్‌' అనే అంశంపై ఉపన్యాసం ప్రారంభించారు. ఐదు నిమిషాల తర్వాత కుప్పకూలారు. హుటాహుటీన ఆయనను స్థానిక బెథనీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు ట్విట్టర్ లో సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంచరణ్ కూడా....
Know as The Missile man ,a poet ,the Bharat Ratna ,visionary and the man who truly loved his country. Will miss u sir.Rest in peace Dr.Abdul kalam   అంటూ రాంచరణ్ తన ట్విట్టర్ లో ఫొటో సహా పోస్ట్ చేశారు.
‘‘మిస్సైల్ మాన్ , ఒక కవి, భారతరత్న , దార్శనికుడు... దేశానికి స్వచ్ఛమైన ప్రేమనందించిన మహనీయుడు. మిమ్మల్ని మేం కోల్పోయాం. మీ ఆత్మకు శాంతి కలగాలి’’

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ