రాంచరణ్ చిరుతతో (2007) మొదలు పెట్టిన సినీ ప్రస్థానం బ్రూస్ లీతో 8 చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. అంటే సంవత్సరానికి ఒక సినిమా చొప్పున చేసుకు పోతున్నాడు. ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడనేది దీన్ని బట్టి అర్థ మవుతోంది. ఆ మధ్య తమిళ డైరెక్టర్ గౌతమ్‌మీనన్‌తో చరణ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని ఓ వార్త వినిపించింది. ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి చేయబోతున్నాడని కూడా అనుకున్నారు. కానీ ఇందులో లవ్ ఎలిమెంట్స్ అధికంగా వుండడంతో పక్కన పెట్టేశాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇదే ప్రాజెక్టుమీద మళ్ళీ ఓ ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఒక్క లాంగ్వేజ్ లోనే కాకుండా నెమ్మదిగా ఇతర భాషల్లోనూ తమ ఫోకస్ పెంచుకోడానికి ఇప్పటి హీరోలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావచ్చనే టాక్ వినిపిస్తోంది.