చిరంజీవి 150వ సినిమా కబుర్లు అటకెక్కాయి గానీ, ఇప్పుడు తండ్రీ తనయుడు కలిసి చేసే స్టెప్పుల మీదకు అందరి మనసూ మళ్ళి పోయింది. రామ్‌చరణ్, శ్రీనువైట్ల కాంబోలో ‘బ్రూస్ లీ’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్లు చూసిన ఆడియన్స్ కు సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పటివరకు ఈ మూవీకున్న క్రేజ్‌ను మరింత పెంచేస్తూ మెగాస్టార్ చిరు ఓ స్పెషల్ సాంగ్‌లో చెర్రీతో కలిసి నటిస్తాడనే ముచ్చట బాగా వినిపిస్తోంది. వీరిద్దరితో గోవా బ్యూటీ ఇలియానా డ్యాన్స్ చేయనుందట. కొద్దిరోజుల్లో ఈ స్పెషల్ సాంగ్ షూట్ చేయబోతున్నారనే వార్త వినిపిస్తుంది. బాలీవుడ్లో అమితాబ్ - అభిషేక్ - ఐశ్వర్యారాయ్‌లు కలిసి తమ డ్యాన్సులతో ఆడియన్స్ కు కిక్ ఎక్కించిన ‘కజరారే’ స్టైల్లో ఈ బ్రూస్ లీ సాంగ్ ఉండబోతుందని టాక్. ఈ అదిరే ఐటంసాంగ్‌కు కొరియోగ్రాఫర్‌గా లారెన్స్ కన్ఫర్మ్ అయ్యాడని లేటెస్ట్ న్యూస్. చిరుతో హిట్లర్, ఇంద్ర, ఠాగూర్, సినిమాల్లో ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించే స్టెప్స్ కంపోజ్ చేసిన లారెన్స్ కు ఈ సాంగ్ అప్పగించారని తెలుస్తోంది. సినిమా సంగతి ఏమో గానీ తండ్రీ కొడుకుల డాన్స్ చూడ్డానికైనా థియేటర్లకు పరుగులు పెట్టడం ఖాయం.