ఇంతలా కవ్వించడం అవసరమా వర్మాజీ?

July 13, 2015 | 12:19 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Ramgopal_Verma_about_bahubali_niharonline

రాంగోపాల్ వర్మ ట్విట్టర్ పోస్టులతో జనాలకు ఏం చెప్పదలుచుకుంటున్నారో ఒక్కోసారి అర్థం కాదు. ఆయన ముక్కుసూటి తనంగా ఉంటే ఉండొచ్చుగాక... కానీ కొన్ని విషయాలు మాట్లాడ్డం వల్ల ఎవరికీ ఏం ఒరిగేది లేనప్పుడు మాట్లాడ్డం ఎందుకూ? అనిపిస్తుంది. ఇంతకు ముందు సినిమా అంటే హీరోలు కనిపించేవారు ఇప్పుడు దర్శకులు కనిపిస్తున్నారన్నారు... ఇది ఒకే అనిపించేలా ఉంది... ఇకపై ఏ పెద్ద హీరోకు చెందిన ఎంత పెద్ద సినిమా వచ్చినా చిన్న బడ్జెట్ సినిమా గానే కనబడుతుందంటున్నాడు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, తారక్, రవితేజ ఈ స్టార్లంతా బాహుబలితో పోలిస్తే తక్కువే అంటూ ట్వీట్ చేసారు. ఇండస్ట్రీని పెద్ద అడవిగా పోలుస్తూ ఇందులో పులులు, సింహాలు, కాలనాగులూ...ఏనుగుల్లా పెద్ద పేర్లతో పాతుకుపోయి ఉన్నారు. ఇప్పుడు వీటన్నిటినీ మించిన బాహుబలి అనే డైనోసర్ వచ్చేసింది. ఇక నుంచి ఇక్కడ రూల్స్ అన్నీ మారిపోతాయంటున్నారు. ఇక ఎంత పెద్ద హీరోతో ఎంత పెద్ద సినిమా తీసినా బాహుబలిని మించలేవట.  బాహుబలి చూసి అందరు దర్శకులు అసూయతో చచ్చిపోతారాట. ఇది రాంగోపాల్ వర్మ అంటున్నమాటలు. మొత్తానికి ఇండస్ట్రీలోని వారందరికీ చురకలేశాడా... లేక గిల్లి గిచ్చి రెచ్చగొట్టాడా? అనేది ఆయనకే తెలియాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ