రామ్ గోపాల్ వర్మ ఈసారి మరో కొత్త రకం కామెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది తన మీద తాను సెటైర్ వేసుకున్నట్టుంది. ఏవరేమనుకున్నా సరే తన మనసులోని అభిప్రాయాలను చాలా నిక్కచ్చిగా చెప్పుకుంటాడు. అయితే ఆయన కామెంట్ చేసింది ఆయన తీసిన 365 డేస్ గురించి. ఈ సినిమా తాను ఇప్పటి వరకూ తీసిన సినిమాలకు ఎంతో భిన్నంగా ఉందో చెప్పాలనుకున్నా ఆయన గమ్మత్తుగా ‘విశ్వనాథ్ గారు రక్త చరిత్ర తీస్తే ఎలా ఉంటుందో తాను 365 డేస్ తీయడం కూడా అలాంటిదై’ అని చెప్పుకున్నారు. విశ్వనాథ్ రక్త చరిత్ర తీస్తే జనాలకు అస్సలు నచ్చదు... మరి ఈయన సినిమా కూడా అలాగే ఉంటుందనుకోవచ్చా...? అంతే కాదు తన కెరీర్ లో క్లీన్ సర్టిఫికెట్ వచ్చిన సినిమా కూడా ఇదేనట.. అయితే అంతా బాగానే ఉంది రక్త పాతాలే కాదు మితిమీరిన అందాలు విచ్చల విడిగా ఆరబోస్తే కూడా యూ సర్టిఫికెట్ ఇవ్వరు. ఇందులో హీరోయిన్ అనైకా ఎక్స్ పోజింగ్ కూడా బాగానే చేసింది... మరి అలాంటి సీన్లు ఉన్నా దీనికి యూ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారబ్బా అని కూడా అనుకుంటున్నారు జనాలు. ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చూద్దాం రాంగోపాల్ వర్మ ప్రయోగం ఫలిస్తుందో లేదో?