స్టార్ హీరోలను తెగ పొగిడేస్తున్న రాయ్ లక్ష్మి

October 03, 2015 | 02:43 PM | 6 Views
ప్రింట్ కామెంట్
ray_laxmi_sardar_niharonline

చిన్న స్టార్ ల నుంచి పెద్ద స్టార్ వరకూ ఒకే విధమైన గౌరవం ఇచ్చి తాము ఎంత పెద్ద స్టార్లమన్న భేషజం చూపించని నటులు పవన్ కళ్యాన్. మన టాలీవుడ్ ఈ కోవకు చెందిన స్టార్లలో మమేష్ బాబు కూడా చేరిపోతారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్నే చెపుతోంది పవన్ తో కలిసి చిందులేసే లక్ష్మీ రాయ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం  వారి దంటోంది. తనకు టాలీవుడ్ లో అయితే పవన్ కళ్యాణ్, కోలీవుడ్ లో అయితే అజిత్ ఆ కోవకు చెందిన వారనీ, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే స్వభావం వారిదంటోంది. ఈ ఇద్దరితో కలిసి పని చేసిన లక్ష్మీరాయ్ ఈ ఇద్దరూ ప్రత్యేకమైన వారనీ, వీరితో తన పని అనుభవాన్ని చెబుతోంది లక్ష్మీరాయ్. అంతేకాదు అజిత్ ఎంత గొప్ప మానవతావాదో.. పవన్ కల్యాణ్ కూడా అంతే గొప్ప మానవతావాది అంటూ ఆకాశానికెత్తేసింది. 

అప్పట్లో అజిత్ కీలకపాత్రలో వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన మన్ కథ (తెలుగులో గ్యాంబ్లర్) చిత్రంలో లక్ష్మీరాయ్ కి పూర్తి స్థాయి క్యారెక్టర్ దక్కింది. అజిత్ కి కెరీర్ 50వ సినిమాలో లక్కీరాయ్ ఆడిపాడింది. ఆ సినిమా తనకి కోలీవుడ్ లో టర్నింగ్ పాయింట్. అలాగే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ లో ఛాన్సిచ్చి లక్ష్మీరాయ్ ని ఆదుకున్నారు. సరైన టైమింగ్ లో వచ్చిన ఆఫర్ ఇది. ఈ ఛాన్స్ పవన్ వల్లే తనకి దక్కిందని లక్ష్మరాయ్ తెగ మురిసిపోతోంది. ఆన్ సెట్స్ అనుభవాల్ని ముచ్చటిస్తూ పవన్ లాంటి గొప్ప మానవతా వాదిని డౌన్ టు ఎర్త్ ఉండే స్టార్ ని చూడలేదని ప్రశంసించింది. హైదరాబాద్ నానక్ రమ్ గుడా రామానాయుడు విలేజీలో భారీ సెట్ వేసి పవన్ -లక్ష్మీరాయ్ పై ఓ స్పెషల్ సాంగ్ ని తెరకెక్కించారు. చాలామంది హీరోలతో నటించాను కానీ పవన్ లాంటి హీరోని చూడలేదని పొగిడేసింది రాయ్ లక్ష్మి. ఆమె పొగడ్తలకు ఇంకొకరింకొకరైతే ఉబ్బి తబ్బిబ్బయిపోయే వారేమో గానీ పవన్ కళ్యాణ్ మాత్రం పొగిడినా, తిట్టినా ఒకే విధంగా స్పందిస్తారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ