డిస్కవరీ ఛానెల్ యాంకర్ గా రానా!

February 23, 2016 | 04:41 PM | 1 Views
ప్రింట్ కామెంట్
rana-daggubati-presenter-discovery-real-heroes-niharonline

రియాల్టి షోకి యాంకర్ లుగా సినీ తారలు పెద్ద విషయమేం కాదు. సినిమాల్లో సీనియర్లు అయ్యాకనో, లేక అవకాశాలు లేకనో ఖాళీగా కాస్త విషయం ఉన్న నటీనటులను వ్యాఖ్యతలుగా పెట్టి టీవీషోల టీఆర్పీ రేటింగ్ లను పెంచేస్తుంటాయి టీవీ చానెళ్లు. అది ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. అయితే కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే ఓ రియాల్టి షోకి వ్యాఖ్యతగా వ్యవహరించేందుకు సిద్ధమైపోతున్నాడు ఓ యువనటుడు. అతగాడు ఎవరో కాదు దగ్గుబాటి నటవారసుడు రానా.  బాహుబలితో కెరీర్ ను భారీ మలుపు తిప్పుకున్న రానా ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

                         అయితే ఇతగాడు యాంకర్ గా వ్యవహరించబోయేది తెలుగు షోకి మాత్రం కాదులెండి. తమిళ చానెల్ లో డిస్కవరీ చానెల్ లో ప్రసారమయ్యే డిస్కవరీ రియల్ హీరోల్ అనే కార్యక్రమానికి. ఈ ప్రోగ్రాం మార్చి 1 నుంచి టెలికాస్ట్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వివిధ భౌగోళిక ప్రదేవాలలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి రియల్ లైఫ్ హీరోలు చూపించే తెగువ, పట్టుదల, నిబద్ధతలను ఇందులో చూపిస్తారంట. బేర్ గ్రిల్స్, లెస్ స్ట్రౌడ్, ఎడ్ స్టాఫర్డ్, జోయెల్ లాంబెర్ట్ వంటి సాహసవీరులు సైతం ఇప్పటి వరకు ఎదుర్కొని పరిస్థితులను ఎదుర్కోని ఎలా బయటపడ్డామో చూపించి.. అందుకోసం కొన్ని టిప్స్ కూడా చెబుతారు ఇందులో పాల్గొనే రియల్ హీరోలు. బాహుబలి షూటింగ్  మధ్య గాప్ లో ఈ షో కి హోస్ట్ గా వ్యవహరించేందుకు రాజమౌళి దగ్గరి నుంచి అనుమతి తీసుకున్నాడంట మన భల్లాలదేవుడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ