భల్లాల దేవకు ఇప్పుడు దేశ మంతా నీరాజనాలు పడుతున్నారు. అసలు హీరోగా రావాలనుకున్నాడో లేదో గానీ, కెరీర్ కాస్త లేటుగానే ఆరంభించాడు... శేఖర్ కమ్ముదర్శకత్వంలో లీడర్ గా కెరీర్ ప్రారంభించాడు రానా. తరువాత ఎన్ని సినిమాలు వచ్చినా బాహుబలితో యాక్టర్‌గా ఇమేజ్ పెంచుకున్న రానా దగ్గుబాటి ఇప్పుడు కెరీర్ కు కొత్త ప్లాన్లు రెడీ చేసుకుంటున్నాడట. అందరు హీరోల్లా తన ఎంట్రీ కమర్షియల్ సబ్జెక్టులతో కాకుండా పొలిటికల్ సబ్జెక్టుతో వచ్చాడు. ఆ తరువాత కూడా కొన్ని సెలెక్టివ్ మూవీలు చేశాడు. నేను నా రాక్షసి, కృష్ణం వందే జగద్గురుమ్ లాంటి సినిమాల్లో నటించినా, బాహుబలిలో భల్లాల దేవ క్యారెక్టర్‌తో ఇండియా మొత్తానికే కాదు ప్రపంచ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఈ గుర్తింపు తెచ్చిన సంతోషంతో ఇప్పుడు తరువాత సినిమాలు చేయాలనుకుంటున్నాడు. తొలి సినిమా లీడర్‌కు సీక్వెల్ ఫ్లాన్ చేస్తున్నాడట రానా. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా స్పీడ్‌గా జరుగుతోందనీ, సెప్టెంబర్‌లో స్టార్ట్ అయ్యే బాహుబలి- 2 షూటింగ్ పూర్తయిన వెంటనే లీడర్ సీక్వెల్ మీద దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.