రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సినిమాతో అందులో నటించిన వారందరికీ మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో విలన్లుగా నటించిన ప్రభాకర్, రానాలకు హీరోకు సమానమైన గుర్తింపు వచ్చింది. రానా ప్రస్తుతం ‘బెంగుళూరు డేస్’ రీమేక్ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఈ సినిమాని పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే రానా పివిపి బ్యానర్ లో ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమా చేసేందకు రెడీ అయ్యాడు. తెలుగులో ఇంత వరకూ నేవీ బ్యాగ్ గ్రౌండ్ సినిమాలు తీయలేదు. ఇది సబ్ మెరైన్ కాన్సెప్ట్ మీద తీస్తున్న సినిమా. తాజా సమాచారం ప్రకారం ఇందులో రానా ఇందులో నేవీ అధికారిగా నటిస్తున్నాడు. 1971 లో ఇండియా – పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ లో పాకిస్తాన్ వాళ్ళు విశాఖపట్నం లోని పిఎన్ఎస్ ఘజి సబ్ మెరైన్ పై దాడి చేసి అది సముద్రంలో మునిగిపోయేలా చేసారు. ఈ వీడని మిస్టరీ కథాంశంతో ఈ సినిమాని తీయబోతున్నారట. ఈ మధ్య రైటర్స్ దర్శకులవుతున్నారు. ఈ సినిమాకు కూడా సంకల్ప్ అనే కొత్త రైటర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారని సమాచారం. ఈ సినిమాని ‘బ్లూ ఫిష్’ అనే బుక్ ఆధారంగా చేసుకొని తీస్తున్నారు. నేవీ అధికారిగా రానా చాలా బాగా కుదురుతాడు. ఈ యుద్ధ నౌకలకు సంబంధించిన స్టోరీ ఆసక్తికరంగా సాగితే ఇది మంచి చిత్రం అవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తీయాలనుకుంటున్న ఈ సినిమా గురించి మరింత సమాచారం అధికారికంగా వెలువడే వరకూ వెయిట్ చేయాలి.