ఒక పక్క రెండు రోజులు సల్మాన్ జైలు శిక్ష గురించి సంఘర్షణ పడుతుండగా, మాజీ ప్రియురాలు మాత్రం పెళ్ళి వేడుకలకు సిద్ధమవుతోంది... అన్నీ కుదిరితే రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ కుటుంబ సభ్యులు ఈ నెలలోనే ‘రోకా’ ఫంక్షన్ జరపాలనుకుంటున్నారట. రోకా అంటే పంజాబీలో నిశ్చితార్థం లాంటిదట. ఈ నెలాఖరున ఈ రోకా ఫంక్షన్ చేయాలని రణబీర్, కత్రినాల కుటుంబ సభ్యులు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ వేడుక అత్యంత సన్నిహిత మిత్రులులు, బంధువుల మధ్య జరగనున్నట్టు తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యల వేడుకల మాదిరిగా అన్న మాట. ఒకవైపు కత్రినా, రణబీర్ ల కుటుంబాలు వీరి పెళ్ళి తంతు గురించి మాట్లాడుకుంటుంటే... ఓ ఫంక్షన్ లో రణబీర్ మాట్లాడిన తీరు అందరికీ నవ్వు తెప్పించింది. ఓ పది రోజుల క్రితం ఆ ఒక్కటి (పెళ్ళిమాట) అడగొద్దన్న వీళ్ళు... ఇప్పుడు రణబీర్ ‘‘నేను ఒకరికి కమిట్ అయిపోయా. ఇక, పెళ్లి చేసుకోవడమే ఆలస్యం. పెళ్ళి ఎప్పుడు అనేది చెప్పలేను.... ఎప్పుడు చేసుకున్నా సరే ముగ్గురు పిల్లలకు తండ్రవ్వాలనుకుంటున్నా’’ అన్నాడట. ఈ కబుర్లు స్తుంటే ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అనుకుంటున్నారట జనాలు. ఇక కత్రిన పెళ్ళి తరువాత సినిమాలు చేయనట్టే కదా... అని కూడా అనుకుంటున్నారట.