నాని హీరోగా ఆ మధ్య వచ్చిన తెలుగు చిత్రం ఆహా కళ్యాణంతో సౌత్ కు పరిచయమైన భామ వాణికపూర్ గుర్తుందా? అఫ్ కోర్స్ బాండ్ బాజా బారాత్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది కాబట్టి ఆమె పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. అయితే అందులో ఓ ముద్దు సీన్ అండ్ బెడ్ సీన్ ఉంటుంది. నాని ఆ సీన్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే... వాణి మాత్రం ఏ మాత్రం మొహమాటం లేకుండా నటించి న్యాయం చేసింది. కట్ చేస్తే ప్రస్తుతం ఆ భామ బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ తో బేఫికర్ అనే ఓ చిత్రం చేస్తోంది.
ఇక ఇందులో ఏకంగా ఈ జంట మధ్య ఏకంగా 23 ముద్దు సీన్లు ఉన్నాయంట. ప్రస్తుతం పారిస్ లో షూటింగ్ జరుగుతుండగా, వీరిద్దరి ఈ పనిలోనే బిజీగా ఉన్నారంట. అంతేందుకు ఈ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా చుంబనంతోనే ఉంది. ఫస్ట్ టైం రణ్ వీర్ తో చేస్తున్నా కూడా బెరుకు లేకుండా అదరాలను అతగాడికి అప్పజేప్పేసిందట వాణి కపూర్. అయినా ఇక్కడ ఫీలవ్వాల్సింది రణ్ వీరో... వాణికపూరో కాదు.. దీపికా పదుకునే ఏమంటారు... లాస్ట్ టాంగో పారిస్ అనే ఫ్రెంచి చిత్రం ఆధారంగా ఇది తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇదే యేడాది ద్వితీయార్థంలో విడుదల కానుంది.