మన సినిమా ఇండస్ట్రీలో వారసత్వ పోకడ బాగా విజృంభించిందని చెప్పాలి. ఫైనాన్షియల్ గా బాగా సెటిలైపోయిన హీరోలు తమ వారసులను దింపేసి తమ అభిమానులనూ వారసులకు వారసత్వంగా ఇచ్చేస్తున్నారు. జనాలూ అలాగే తయారయ్యారనుకోండి... ఒక్కోసారి అభిమానులు సైడైపోతున్న సందర్భాలూ ఉన్నాయి. ఓ ఫామిలీలో ఓ నలుగురైదుగురు హీరోలు వస్తే అభిమానులు అందరినీ అభిమానించే పిచ్చిలో పడిపోలేదనుకోండి. అయినా సరే వారిని ఎలాగోలా వాడుకుందామని చూస్తున్నారు సీనియర్ హీరోలు. ఇది గమనించేనేమో రవి తేజ తాజాగా తన బెంగాల్ టైగర్ చిత్రంలో డైనమెట్ లా పేలిపోయే ఓ డైలాగ్ తో అభిమానులను అలరించనున్నాడు. ఇది కొంతమంది వారసులకు గట్టిగా తగిలిందని అంటున్నారు . ఇంతకీ రవితేజ చెప్పిన డైలాగ్ ఏంటో తెలుసా ''నేను ఎవరి సపోర్ట్ తో పైకి రాలేదు ......... స్వతహాగా పైకి వచ్చిన వాడిని '' అంటూ పెద్ద బాంబే పేల్చాడు. బాంబు బాగానే ఉంది గానీ... ఈయనకూ ఓ సుపుత్రుడున్నాడు మరి ఫీల్డ్ లోకి తీసుకురాడంటారా?