రవి తేజ డాన్స్ లో ఇరగదీస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నదే అల్లరల్లరిగా మెలికలు తిరిగిపోతూ ‘హాయ్ రే హాయ్ జాంపండురోయ్’ అంటూనే... మరి ఈ మాస్ మహరాజ్ 120 మంది డాన్సర్స్ తో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. బెంగాల్ టైగర్ చిత్రంలో ఈయనగారు ఇంతమంది డాన్సర్స్ తో చిందులేస్తున్నారట మరి. తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్ గా, సంపత్ నంది దర్శకత్వంలో తీస్తున్న ‘బెంగాల్ టైగర్’ చిత్రానికి సంబందించి థీమ్ సాంగ్ ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ లో 120 మంది డాన్సర్స్ తో ఇంట్రడక్షన్ సాంగ్ గా చిత్రీకరిస్తున్నారు . ఈ సాంగ్ కోసం హీరోయిన్ హంసనందిని మాస్‌మహరాజ్ తో స్టెప్స్ వేస్తుంది. ప్రేక్షకాదరణ వున్న చిత్రాల్ని నిర్మించిన కె కె రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాత. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బలుపు’,’ పవర్’ చిత్రాల తరువాత రవితేజ, రచ్చ చిత్రం తరువాత సంపత్ నంది కాంబినేషన్ లో ఈ చిత్రం వస్తుండటంతో ‘బెంగాల్ టైగర్’ చిత్రపై రవితేజ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి
నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్ లో రెడీ అవుతున్న ‘బెంగాల్ టైగర్’ చిత్రం షూటింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు చేస్తున్న డాన్స్ ను ప్రముఖ కన్నడ కొరియోగ్రాఫర్, దర్శకుడు హర్ష ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇటివలే హర్ష కన్నడంలో శివరాజ్ కుమార్ తో రూపొందించిన వజ్రకాయ చిత్రం లో రవితేజ ఒక ప్రత్యేక గీతం లో సైతం మెరిశారు ఈ సాంగ్ లో హీరోయిన్ హంసనందిని మాస్‌మహరాజ్ తో స్టెప్స్ వేస్తున్నారు. ఈ సాంగ్ చిత్రానికి హైలెట్ అయ్యే విధంగా దర్శకుడు సంపత్ నంది ప్లాన్ చేశారు. సినిమాలో ఓ మంచి టెకాఫ్ గా ఈ సాంగ్ నిలబడుతుంది. ఇప్పటికే మా టైటిల్ అన్ని వర్గార ప్రేక్షకుల కి రీచ్ కావటం మా చిత్రం మెదటి సక్సస్ గా అనుకుంటున్నాం”అని అన్నారు. ఈ చిత్రంలో బోమన్ ఇరాని, బ్రహ్మనందం, రావు రమేష్, షియాజి షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, హర్హవర్ధన్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదితరులు నటించారు.