విడుదలకు సిద్ధమైన ‘చిలుకూరు బాలీజీ’

August 12, 2015 | 01:03 PM | 3 Views
ప్రింట్ కామెంట్
chilkur_balaji_movie_stills_niharonline

వీసాల బాలాజీగా పేరుపొందిన చిలుకూరు వెంకటేశ్వర స్వామిపై ఓ సినిమా రాబోతోంది. ఇటీవల కాలంలో ఈ దేవాలయానికి వెళ్ళే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు తమ కోరికలు తీరడం కోసం ఇక్కడికి వేల సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఇప్పుడు చిలుకూరి బాలాజీ చరిత్రను సినిమాగా రూపొందిస్తున్నామని చిత్ర విశేషాలను గురించి దర్శక నిర్మాత అల్లాణి శ్రీ్ధర్ తెలిపారు. సాయికుమార్, బాలసుబ్రహ్మణ్యం, సుమన్, ఆమని ముఖ్యపాత్రల్లో ఈటీవీ మరియు ఫిల్మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ‘చిలుకూరు బాలాజీ’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే గ్రాఫిక్స్ వర్క్ పూర్తిచేసుకుని త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుందని తెలిపారు ఈ చిత్రానికి సుద్దాల అశోక్ తేజ, జొన్నవిత్తుల అందించిన పాటలు కలకాలం నిలిచిపోయేలా వుంటాయన్నారు. సినిమాను చూసిన చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సౌందర్‌రాజన్‌ అద్భుతంగా ఉందని ప్రశంసించారని, అన్నమయ్య, రామదాసు చిత్రాల తరహాలో ఈ సినిమా కూడా ఉంటుందని తిరుపతి వేంకటేశ్వరస్వామి చిలుకూరుకు ఎందుకు వచ్చాడు? ఎలా వెలిశాడు అనే ఇతివృత్తంతో ఈ సినిమా ఉంటుందన్నారు. ఇందులో గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, ఇటీవలే ఆ కార్యక్రమాలన్నీ పూర్తిచేశామని, త్వరలోనే మొదటి కాపీ వస్తుందని, ఈనెలలోనే ఆడియోను విడుదల చేసి సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ