బుల్లి సినిమాలో రెబల్ స్టార్

November 21, 2014 | 02:46 PM | 38 Views
ప్రింట్ కామెంట్

రెబల్ స్టార్ కృష్ణంరాజు... గాంభీర్యమైన పాత్రలకు పెట్టింది పేరు. ఆరడుగుల పై ఉండి రాజసం ఉట్టిపడే పాత్రలతో తెలుగు చిత్రపరిశ్రమలో రెబల్ స్టార్ గా పేరును సార్థకం చేసుకున్నారు. అడపాదడపా చిత్రలలో మెరుస్తున్న ఆయన గురించి ఇప్పుడో ఆసక్తికరమైన విషయం. త్వరలో ఆయన ఒక షార్ట్ ఫిలింలో నటించబోతున్నారని తెలుస్తోంది. ‘క్లీనింగ్ ఆఫ్ ద హోళీ గంగా’ అనే పేరుతో ప్రముఖ గజల్ గజల్ శ్రీనివాస్ ఒక షార్ట్ ఫిలిం తీయడానికి సిద్ధమయ్యాడు. ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ కీలకపాత్రలో నటించనున్నాడని సమాచారం. గంగానది ప్రక్షాళన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి తాను ఈ చిత్రాన్ని తీయాలనుకుంటున్నానని గజల్ శ్రీనివాస్ తెలిపాడు. ఇటీవల అల్లుఅర్జున్, సిద్ధార్థ్ లాంటి యువ హీరోలు షార్ట్ ఫిలింలో తళుక్కుమనడమే మనం చూశాం. కానీ, కృష్ణంరాజు లాంటి ఓ సీనియర్ నటుడు సామాజికాంశం ఉన్న ఓ కథలో నటించడం గొప్ప విషయం. దీనిని మిగతా సీనియర్లు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఆశిద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ