మహేష్ జోడీగా మహేష్ కూతురు?

May 06, 2016 | 11:04 AM | 6 Views
ప్రింట్ కామెంట్
mahesh-babu-alia-bhatt-murugadoss-niharonline

ఓవైపు బ్రహ్మోత్సవం పనులు చకచకా పూర్తయి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తర్వాతి ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభిస్తాడనే అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. మురుగదాస్ తో ఓ ద్విభాషా చిత్రం తీయబోతున్నాడని అందరికీ తెలిసిందే. న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ సందేశాత్మకంగా ఈ చిత్రం ఉండబోతుందని అల్రెడీ మురగదాస్ చెప్పేశాడు కూడా. ఠాగూర్ మధు-ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 80 కోట్లు ఉండవచ్చని సమాచారం. మహేశ్ కెరియర్లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కాబోతుంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు అనౌన్స్ అయినప్పటి నుంచి ఇందులో హీరోయిన్ ఎవరనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. శ్రుతిహాసన్, కీర్తి సురేష్, ఇలా సౌత్ తోపాటు, పరిణితీ చోప్రా, శ్రద్ధా కపూర్, అలియా భట్ వంటి బాలీవుడ్ గుమ్మల పేర్లు కూడా వినిపించాయి.

                                అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ బ్యూటీ, దర్శకుడు మహేష్ భట్ కూతురు అలియా భట్ నే ఫైనలైజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చిత్రం తెలుగు, తమిళ్ లో ఏకకాలంలో రూపుదిద్దుకుంటున్నప్పటికీ బాలీవుడ్ లోనూ డబ్ చేయాలని చూస్తున్నారంట. ఇందుకోసం అక్కడ కూడా కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్ నే తీసుకోవాలని చూస్తున్నారు. అందుకే అలియాభట్ పేరును ప్రతిపాదనలోకి తీసుకుందట చిత్ర యూనిట్. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండటంతో ఈ సీరియల్ కిస్సింగ్ గర్ల్ ను రెండో హీరోయిన్ గానే తీసుకోవచ్చని, మెయిన్ హీరోయిన్ గా ఎవరైనా సీనియర్ నటిని తీసుకుంటారని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ