అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్ కు ఈసారి ఆ ఛాన్స్ లేనట్టే. భారతీయ మ్యూజిక్ డైరెక్టరుగా చరిత్ర సృష్టించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ 87వ ఆస్కార్ అవార్డుల్లో మరోసారి సత్తా చాటాలని ప్రయత్నించాడు. 2014లో ఆయన సంగీత సారథ్యం వహించిన మిలియన్ డాలర్ ఆర్మ్, హండ్రడ్ ఫుట్ జర్నీ, కొచ్చాడియాన్ సినిమాలు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ బరిలో పోటీ పడ్డాయి. అయితే ఫైనల్ నామినేషన్ లో ఈ చిత్రాలకు చోటు దక్కలేదు. దీంతో ఈ సారి ఆయనకు అవార్డు దక్కే అవకాశం లేనట్టే అని స్పష్టం అవుతోంది. ఫిబ్రవిర 22న ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. గతంలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి రెహ్మాన్ ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.