ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ మళ్ళీ ఓ చురక వేశారు. ఈసారి ఊరూరా వాడ వాడలా గణేష్ విగ్రహాలు ప్రతిష్టించి ఉత్సవాలు జరుపుతున్న నిర్వాహకులనుద్దేశించి ట్విటారు రేణు దేశాయ్. దీనర్థం ఏమిటంటే వినాయక విగ్రహాలకు భక్తితో పూజలు నిర్వహించడానికి బదులు నిర్వాహకులు చేసే కార్యక్రమాలు ఆమెకు ఎంత మాత్రమూ నచ్చలేదు. పైగా ఐటమ్స్ సాంగ్స్ మండపాల వద్ద ప్లే చేయడం ఆమెను హర్ట్ చేసినట్టుంది. అందుకే వినాయకుడిపై భక్తిని ఐటమ్ సాంగ్స్ తో చాటుకుంటున్నారా? అని ఆమె ప్రశ్నించింది. వేల వేల విగ్రహాలు ప్రతిష్టించి భక్తితో నవ రాత్రలు పూజలు నిర్వహించే వారు ఎందరో గానీ, కొందరైతే పెద్ద సౌండులతో ఐటెం పాటలు పెట్టి పిల్లలకు నిద్ర లేకుండా చేస్తున్నారని ఆమె అంటున్నారు. ఈ విషయం గురించయితే రేణు దేశాయ్ ను తప్పకుండా సపోర్ట్ చేయాల్సిందే. ఒక పక్క వినాయకుడి ఊరేగింపు జరుపుతూ మరో పక్క తాగి గోల చేసే వాళ్ళు ఎందరో.... ఇదేం భక్తి చెప్పండి?