సమ్మర్ సెగ చల్లారాకే నాని దిగేది

April 02, 2016 | 05:24 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Nani-Indraganti-Movie-after-summer-niharonline

ఒక్కసారిగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లతో హీరోల్లోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నాడు నాని. భలే భలే మగాడివోయ్,  కృష్ణగాడి వీర ప్రేమ గాథ  సినిమాలు సూపర్ హిట్ లు కొట్టి ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధమైపోతున్నాడు.

                          సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. మార్చి 14 నుంచి ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతూ వస్తున్నారు. ఏప్రిల్ 6 వరకూ జరిగే ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ పూర్తవుతుందని, చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చెప్పారు. రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంగా ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. అంతేకాదు ఒక్కపాత్ర నెగటివ్ టచ్ తో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంతో నానికి హ్యాట్రిక్ హిట్ ను అందించడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. చిత్రం ముగింపు దశకు చేరకున్నప్పటికీ ప్రస్తుతం బడా చిత్రాలు ఉండటంతో, సమ్మర్ ముగిశాకనే చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత ప్రసాద్ చెబుతున్నారు. ఈ మధ్యలో టైటిల్ ఎనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ టీజర్ ను వదిలే ఆలోచనలో ఉన్నామని చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ