దర్శకుడి గుణ శేఖర్ చిరకాల కోరిక నెరవేరింది. అలాగే ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన రుద్రమదేవి కలెక్షన్లు ఊహించిన దానికంటే ఆయనకు అధిక ఉత్సాహాన్నిచ్చాయి. ఈ ఊపుతో ఆయన ప్రతాపరుద్రుడు సినిమా ప్లానింగ్ అతి తొందరలోనే చేపట్టేలా కనిపిస్తోంది. ఆ సినిమా విడుదలై నేటికి 9 రోజులు అవుతోంది. ఇప్పటి వరకూ 57 కోట్లు రాబట్టింది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా 25 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, అనుష్కలు చేసిన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ డైలాగులకు జనాలు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమా తెలంగాణా ప్రాంతం రాజరికపు కథ కావడంతో అల్లు అర్జున్ కు ఆ స్లాంగ్ వాడడంతో ప్రేక్షకులు ఆనందాశ్చర్యాలతో గోన గన్నారెడ్డిని బాగా రిసీవ్ చేసుకున్నారు.
ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది. గుణ శేఖర్ ఈ సినిమా కోసం పెట్టిన పెట్టుబడి మరో వారం తిరగక ముందే రాబట్టు కోగలుగుతారు. ఇక తరువాత వచ్చేదంతా లాభాల ఖాతాలోకి చేరిపోతుంది.