ఉత్తమ విలన్ డేట్లు ఫిక్స్ చేశారు

February 02, 2015 | 02:49 PM | 57 Views
ప్రింట్ కామెంట్

లోకనాయకుడు కమల్‌హాసన్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉత్తమ విలన్' చిత్ర రిలీజ్ డేట్ ఖరారైంది. తెలుగు, తమిళం, హిందీ మొత్తం మూడు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ చిత్రానికి కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, ఎన్ లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం మార్చి 1న ఆడియోను విడుదల చేసి, ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ చిత్రంలో కమల్ రంగస్థల కళాకారుడిగా, సినీ నటుడిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. అంతేకాదు చిత్రానికి స్క్రిప్టు వర్క్, డైలాగ్స్ కూడా స్వయంగా కమలే రచించాడట. ఉత్తమన్ అనే పాత్ర 8వ శతాబ్దానికి చెందిన డ్రామా యాక్టర్. మనోరంజన్ అనే పాత్ర 21 శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్ర. ఈ రెండు పాత్రలను తనదైన రీతిలో కమల్ హాసన్ రక్తి కట్టించాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికి చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం. స్వర్గీయ కె. బాలచందర్ తోపాటు కళాతపస్వి కె.విశ్వనాథ్, ఆండ్రియా, పూజాకుమార్, జయరాం ప్రధాన పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ