చారిత్రక కథతో రూపొందించిన ‘రుద్రమదేవి’ సినిమా చూడాలని అందరూ చాలా ఉత్సాహపడిపోయారు. ఈ సినిమా పోస్టర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. దీంతో జనాల్లో అప్పట్లో చాలా క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా క్యాస్టూమ్స్, పాత్రల గెటప్స్, విడుదల చేసిన ట్రైలర్ చాలా ఎట్రాక్టివ్ గా కనిపించాయి. కానీ విడుదలలో ఎందుకో విపరీతమైన జాప్యం జరిగింది. ఓ పక్క పనులు అనుకున్న సమయానికి పూర్తికాలేదు. మరోవైపు బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగలేదు. దీంతో బాహుబలికి ముందే తన సినిమాను విడుదల చేయాలన్న అతడి ఆశ నెరవేరలేదు. ఐతే అయ్యిందేదో అయ్యిందని ఆగస్టులో ‘రుద్రమదేవి’ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాడు గుణశేఖర్. బిజినెస్ విషయంలో కొంచెం ఆందోళనగా ఉన్న గుణశేఖర్ కు ఊరటనిస్తూ ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ‘రుద్రమదేవి’ కృష్ణా జిల్లా హక్కులను 2.80 కోట్లకు సొంతం చేసుకున్నాడు. బాహుబలితో పోలిస్తే ఈ మొత్తం తక్కువే కానీ.. రుద్రమదేవి వరకు ఇది ఎక్కువే. ఓ స్టార్ హీరో సినిమా స్థాయిలో హక్కులు అమ్ముడవడంతో గుణశేఖర్ కు ఈ ప్రోత్సాహం చాలా ఆనందదాయమకనే చెప్పుకోవచ్చు. ఇదే స్థాయిలో మిగతా ఏరియాల బిజినెస్ కూడా జరిగితే గుణశేఖర్ సేఫ్ అయిపోయినట్లే. తన కలల ప్రాజెక్టు కోసం ఎవరూ ఊహించని స్థాయిలో ఏకంగా రూ.70 కోట్ల దాకా బడ్జెట్ పెట్టాడు గుణశేఖర్. భారతదేశపు మొట్టమొదటి ౩డీ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రను అనుష్క పోషించగా మరో ప్రధాన చారిత్రక గోనగన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించారు. హీరో రానా నిత్యామీనన్లు కీలక పాత్రల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించడం విశేషం.