రుద్రమ కోటి క్లబ్ లో చేరలేదు

October 10, 2015 | 03:24 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Rudramadevi_new_stills_niharonline(1)

రుద్రమదేవి సినిమా గురించి మాట్లాడుకుంటే మొదటి ఈ సినిమా దర్శక నిర్మాత గుణ శేఖర్ కష్టాలే గుర్తుకు వస్తాయి అందరికీ. ఈ సినిమా ఆయన అభిరుచి మేరకు బడ్జెట్ కు వెరవకుండా ఓ యజ్ఞంలా ఈ సినిమాను చేశారు. హిస్టారికల్ ఎపిక్ మూవీ కావడంతో తెలుగు సినీ అభిమాను కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. గుణశేఖర్ మూడేళ్ళ శ్రమ ‘రుద్రమదేవి’.  నిన్న అర్థరాత్రి నుంచే సినిమా సందడి మొదలవ్వగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోతో రుద్రమదేవి హడావుడి ఊపందుకుంది. ఇక ఈ చారిత్రక సినిమాకు అమెరికాలోనూ అద్భుతమైన ఆదరణ కనిపిస్తోన్నంది. అక్కడ 150 స్క్రీన్లలో రుద్రమదేవి ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ఈ ప్రీమియర్ షోల ద్వారా 127,276 డాలర్లు వసూలు చేసింది. శ్రీమంతుడు, బాహుబలి అంతటి క్రేజ్ కాకపోయినా... ప్రేక్షకుల ఇంటరెస్ట్ చూస్తుంటే గుణ శేఖర్ పెట్టిబడి రాబట్టేలాగే కనిపిస్తోంది. ఈ వారాంతంలో అక్కడ కలెక్షన్ల జోరు పెరిగేలా ఉంది. ఒక చారిత్రక కథను చెప్పాలన్న గుణశేఖర్ ఆలోచన, అల్లు అర్జున్, అనుష్కల నటన, ఆర్ట్ వర్క్ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ