ఆస్కార్ కు నామినేట్ అయిన బాహుబలి

August 27, 2015 | 04:13 PM | 8 Views
ప్రింట్ కామెంట్
baahubali_stills_niharonline(5)

తెలుగు సినిమా పరిశ్రమ సంబరాలు చేసుకోవాల్సిన సంవత్సరమిది. ఈ ఏడాది బాహుబలి రిలీజ్ అయి ఇప్పటి వరకూ ఏ ప్రాంతీయ సినిమా సాధించిన రికార్డులను కొల్ల గొట్టింది. ఒక తెలుగు సినిమా ప్రపంచ దేశాల గుర్తింపును పొందింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 600 కోట్లతో సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ ఫిల్మ్స్ రేస్ లో ఉంది. పాపులర్ ఫిలిం మేకర్ అయిన అమోల్ పాలేకర్ నేతృత్వంలో ఆస్కార్ సెలక్షన్ పానల్ లో ఉన్న ఐదుగురు సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. వారు ఇండియా తరపున ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ నామినేషన్స్ కి పంపాల్సిన 45 సినిమాలను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు. మన తెలుగు చాంబర్ ఆఫ్ కామర్స్ వారు బాహుబలి సినిమాని తెలుగు సినిమా నుంచి అఫీషియల్ ఎంట్రీ గా వారికి పంపారు. వారు కూడా బాహుబలి సినిమాని ఆస్కార్ నామినేషన్స్ కి పంపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాది ఆస్కార్ కి వెళ్లనున్న బాలీవుడ్ సినిమాలైన అమీర్ ఖాన్ ‘పికె’, అనురాగ్ కశ్యప్ ‘అగ్లీ’, విశాల్ భరద్వాజ్ ‘హైదర్’, ప్రియాంక చోప్రా ‘మారీ కామ్’ లతో బాహుబలి సినిమా పోటీ పడుతుంది. ఇది కాకుండా మాసాన్, కాక ముట్టై, ఉమ్రిక మొదలైన సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్లనున్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే. కె. విశ్వనాథ్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ‘స్వాతి ముత్యం’ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆస్కార్ కి వెళ్లనున్న మరో తెలుగు సినిమా బాహుబలి మాత్రమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ