కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఫాంటమ్'. ఈ సినిమాను పాకిస్తాన్ లో బేన్ చేశారు. సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో 26/11 ముంబై ఉగ్రవాద దాడులకు సంబంధించిన కథతో తెరకెక్కించారు. దాడుల వెనుక ఉన్న పెద్ద తలలను మట్టుపెట్టే ఆర్మీ ఆఫీసర్ గా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. ఈ సినిమాను ఈ రోజు విడుదల చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పాకిస్తాన్ లో ఈ సినిమాపై నిషేధం విధించడం పై ప్రెస్ మీట్ పెట్టిన సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ... ‘‘జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయ్యద్ ముంబై టెర్రరిస్టు దాడుల వెనక అసలు సూత్రధారి అని పేర్కొనడం పలువుర్ని షాక్ కు గురి చేసింది. ఇంతే కాకుండా 2012లో ఐఎస్ఐ చీఫ్ గా పనిచేసిన మేజర్ జనరల్ అలీఖాన్ తనకు అంకుల్ అవుతాడనీ, చిన్నతనంలో ఆయన పిల్లలతో కలిసి ఆడుకున్నట్లు తెలిపారు. దేశం కన్నా తనకు ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ కాదని, భారత దేశానికి హాని చేసేవారు తన కుటుంబ సభ్యులైనా, వారికి మద్ధతు తెలిపే ప్రసక్తే లేదంటూ దేశ భక్తుడిగా మారిపోయాడు. ప్రస్తుతం పాక్ విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న షేర్యార్ ఖాన్ కూడా తన బంధువే అని చెప్పుకున్నాడు. భారత ప్రభుత్వంతో ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయిని తెలిపారు. అయితే సైఫ్ దేశ భక్తుడిగా నిజంగానే మారిపోయాడా? లేక ‘ఫాంటమ్' సినిమాకు పబ్లిసిటీ పెంచేందుకే ఇలా మాట్లాడుతున్నాడా? అని పలువురు అనుకుంటున్నారు. అయితే విడుదలైన ఫాంటమ్ సినిమాకు సంబంధించిన వార్తలు మాత్రం ఇంకా ఏమీ బయటికి రాలేదు.