కండలు తీరిగిన ఈ వీరుణ్ణి దోచేయడమేంటి? ఇదేదో సినిమా కథ అనుకుంటున్నారేమో... కానే కాదు... నిజంగానే అభిమానులమంటూ వచ్చిన నలుగురు అమ్మాయిలు సల్మాన్ వాలెట్, సన్ గ్లాసెస్, పెండెంట్ కొట్టేసారు. సల్మాన్ ఖాన్ అసలు విషయం గ్రహించే లోగా వారంతా అక్కడి నుండి వెళ్ళిపోయారట. గత వారం సల్మాన్ ఖాన్ బాంద్రలోని ఓ నైట్ క్లబ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నలుగురు అమ్మాయిలు ఆయన దగ్గరికి వచ్చాడు. మేమంతా మీకు వీరాభిమానులమంటూ పరిచయం చేసుకున్నారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ తన కూర్చున్న టేబుల్ మీద తన వాలెట్, సన్ గ్లాసెస్, బజరంగీ భాయి జాన్ చిత్రంలో వాడిన పెండెంట్ ఉంచాడు. సల్మాన్ ఖాన్ ను మాటల్లో పెట్టి వాటిని మాయం చేసారట ఆ నలుగురు అమ్మాయిలు. విషయం గ్రహించేలోగా తన వస్తువులతో పాటు ఆ అమ్మాయిలు అక్కడ కనిపించలేదట. ఈ విషయమై ఆయన సెక్యూరిటీ గార్డులు పోలీసులకు ఫిర్యాదు చేద్దామని సలహా ఇచ్చినప్పటికీ.... సల్మాన్ ఖాన్ అందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇటీవల జుహులోని ఓ హోటల్‌కు సినిమా ప్రోమో విడుదల చేయడానికి వచ్చిన సల్మాన్ ఖాన్ టైట్ సెక్యూరిటీతో వచ్చాడట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముంబై అంత సేఫ్ సిటీ కాదు, ఎప్పుడు ఏమైనా జరుగవచ్చు. అంతా జాగ్రత్తగా ఉండాలి అని వ్యాఖ్యానించాడట. కానీ సల్మాన్ అర్థం చేసుకోవడం లేదు. పోయిన వాటి విలువ కోట్లు దాన దర్మాలు చేసే ఆయనకు పెద్ద ఎక్కువేం కాకపోవచ్చు. కానీ ఒక విషయం గమనించాలి. సల్మాన్ వాలెట్ ఇది, సల్మాన్ సన్ గ్లాసెస్ ఇవి... ఇంకా ఈ పెండెంట్ చూశారా? ఇది సల్మాన్ ధరించింది... అంటూ ఆ అమ్మాయిలు స్నేహితుల ముందు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నారో? వాటిని వారెంత భద్రంగా దాచుకుంటున్నారో? సల్మాన్ ఈ కోణంలో కూడా ఆలోచించాలి.