‘బాహుబలి’ సినిమా చూసిన బాలీవుడ్ బాహుబలి

July 13, 2015 | 03:15 PM | 3 Views
ప్రింట్ కామెంట్
salmankhan_bahubali_niharonline

బాలీవుడ్ ను ఏలుతున్న ముగ్గురు ఖాన్ లలో బాహుబలి గురించి మాట్లాడి ప్రశంసలు కురిపించిన హీరో సల్మాన్ ఖాన్. అయితే ఆయన ఈ రోజు తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి థియేటర్ కు వెళ్ళి బాహుబలి సినిమా చూశాడట.  వీరిలో సల్మాన్ ఖాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సంగీత బిజెలానీతో పాటు, మరికొందరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమా చూడటానికి ముందు నుండే సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంత సంచలనం రేపడం ఆనందంగా ఉందని అనానరు. ఆదివారం రాత్రి బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ రిసెప్షన్ ఉన్నప్పటికీ,  సల్మాన్ ఖాన్ అటు వెళ్లకుండా ‘బాహుబలి' చూడటానికి వచ్చారు. తన గర్ల్ గ్యాంగ్ సంగీత బిజెలానీ (అతని మాజీ ప్రియురాలు), డైసీ షా, ఎల్లి అర్వమ్, స్నేహా ఉల్లాల్ లతో కలిసి సల్మాన్ ఖాన్ లైట్‌బాక్స్‌ లో వేసిన ‘బాహుబలి' స్పెషల్ షో చూసారు. వీరితో పాటు వరుణ్ ధావన్, డేవిడ్ ధావన్, అల్విరా ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, పులకిత్ సామ్రాట్ అతని భార్యతో కలిసి, సూరజ్ పంచోలి తదితరులు ఈ సినిమా చూసారు.  బాహుబలికి కథ అందించిన విజయేంద్రప్రసాద్ సల్మాన్ సినిమా బజ్రంగి భాయిజాన్ కూడా కథ రాశారు. అయితే రానాకు యాక్టర్ కావాలని సల్మాన్ ప్రోత్సహించాడట. ఇపుడు అతను రియలైజ్ అయ్యాడు. బాహుబలిలో ఆయన రియల్ స్టార్ అయ్యాడు. దగ్గుబాటి ఫ్యామిలీకి సల్మాన్ ఖాన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సన్నిహితత్వంతో రానాను యాక్టర్ కావాలని ప్రోత్సహించేవాడట సల్మాన్. బాహుబలి సినిమాలో రానా విలన్ అయినప్పటికీ ఆయనకు హీరోతో సరిసమానమైన రోల్ ఇది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ