ఓ స్టార్ హీరో మరో స్టార్ హీరోను పొగుడుతూ ప్రశంసించడం ఇరువురి అభిమానులకూ కన్నుల పండుగే... చిరంజీవి బర్త్ డే సందర్భంగా హాజరైన సల్మాన్ ఖాన్ ఆయనను రాక్ స్టార్ అంటూ ప్రశంసించాడు. సల్మాన్ ఖాన్ తెలుగు హీరోలందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. హైదరాబాద్ కు తరచూ వచ్చే సల్మాన్ టాలీవుడ్ హీరోలతో సరదాగా గడిపేస్తుంటాడు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతోనూ చాలా మింగిల్ అయిపోతాడు. చిరంజీవితో సల్మాన్ దోస్తి థమ్సప్ యాడ్ తో కలిసి నటించినప్పటి నుంచీ కొనసాగుతోందట. స్టాలిన్ రీమేక్ హక్కుల్ని తీసుకుని సల్మాన్ హిందీలో జయహో పేరు తో రీమేక్ చేశారు. ఈ ప్రాసెస్ లో చిరు నుంచి సల్మాన్ కి కావాల్సినంత ప్రోత్సాహం ఉంది. ఈ సంగతులన్నీ సల్మాన్ స్వయంగా చెప్పారు. థమ్సప్ యాడ్ షూటింగ్ తర్వాత ఆర్నెల్లకు చిరుతో కలిసి ఓ మీట్.... ఆయన ముంబై వచ్చి ఓ హోటల్ లో ఉన్నారప్పుడు. చిరు మా ఇంటికి వచ్చి నాన్నగారితో ముచ్చట్లాడారు. మేమంతా కలిసి చిలౌట్ చేసుకున్నాం. ఆ తర్వాత హోటల్ కి వెళతానన్నారు చిరంజీవి. ఇక్కడే ఉండండి. మా బెడ్ రూమ్ లో నిద్రపోండి అన్నాను. దానికి ఆయన అవును కరెక్టే. హోటల్ రూమ్ కి వెళ్లాలంటే చాలా టైమ్ పడుతుంది. ఇక్కడే ఆ కోచ్ లో పడుకుంటా.. అన్నారు. ఆయన అమేజింగ్ పర్సన్. స్నేహశీలి. ఫ్యామిలీ మేన్. అందుకే తనకోసం ఎప్పుడు ఏం చేయడానికైనా రెడీగా ఉంటా.. అని చెప్పారట సల్మాన్. ఈ సందర్భంగానే చిరు ఓ రాక్ స్టార్. నాకంటే బాగా డ్యాన్సులు చేస్తారు. కేవలం డ్యాన్సులే కాదు అతడి నటన తీరు అమోఘం. చిరు పూర్తి క్లారిటీ ఉన్న మనిషి. అతడు రియల్ లైఫ్ హీరో అంటూ తెగ పొగిడేశాడట సల్మాన్.