‘హీరో’ సినిమాకు సల్మాన్ టైటిల్ సాంగ్

August 07, 2015 | 04:19 PM | 4 Views
ప్రింట్ కామెంట్
salman_singing_for_hero_movie_niharonline

సల్మాన్ ఖాన్ తన సినిమాకు కాకుండా ఓ ప్రేమ కథా చిత్రం‘హీరో’కు టైటిల్ సాంగ్ పాడాడు. ఈ చిత్రానికి సల్మాన్ నిర్మాత కావడం విశేషం... జాకీష్రాఫ్-మీనాక్షి శేషాద్రి నటించిన అలనాటి బంపర్ హిట్ చిత్రం హీరో సినిమాను రీ మేక్ చేస్తున్నారట. నిర్మాత, దర్శకుడు సుభాష్ ఘైసల్మాన్ తో ఓ సినిమా తీయాలని అని అనుకున్నాడట. అతని ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో సల్మాన్ తప్పకుండా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో బాగంగా సుభాష్ ఘయ్ ఒకప్పుడు నిర్మించి,దర్శకత్వం వహించిన హీరోను రీమేక్ చేయాలని తలపెట్టారు. ఈ చిత్రానికి సల్మాన్ నిర్మాతగా మారాడు. రీమేక్ రైట్స్ ఇచ్చినందుకు సుభాష్ ఘైకు కూడా భాగం ఇచ్చాడు సల్మాన్. ఈ చిత్రంలో జరీనావహాబ్ఆదిత్య పంచోలి తనయుడు సూరజ్ పంచోలీ కథానాయకుడు. నాయికగా సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని ఎంపిక చేశారు... ఈ సినిమా పూర్తయి ఫస్ట్ కట్ చూసిన తరువాత ఇందులో తన గళం వినిపిస్తే చిత్రానికి అదో ప్రత్యేక ఆకర్షణ అవుతుందని సల్మాన్ భావించాడు. అందుకే టైటిల్ సాంగ్ తనే పాడాడు. సల్మాన్ ఈ సినిమాతో సుభాష్ ఘయ్ కు బాసటగా నిలవడమే కాక, ఇందులో హీరోగా నటించిన సూరజ్ పంచోలీకి కూడా సల్మాన్ నైతిక బలాన్నిచ్చాడు. నిజానికి ఈ సినిమాకు ముందే సూరజ్ ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో ముద్దాయి. ఆ బాధలో సూరజ్ సతమతమవుతున్న సమయంలోనే అతనికి ఊరటనిస్తూ ఈ సినిమా నిర్మిస్తున్నాడట. ఆ కృతజ్ఞతతో సూరజ్ హీరో ట్రయిలర్ రిలీజ్ రోజున కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. ఇప్పుడు ఈ చిత్రానికి ‘మై హూ హీరో తేరా...’ పాట పాడి మరింత క్రేజ్ ను సంపాదించి పెట్టాడు సల్మాన్. అన్నట్టు ఈ పాటను సల్మాన్ ఖాన్ అర్ధరాత్రి పాడడం విశేషం. ఈ సినిమాకు అమాల్ మల్లిక్మీట్ బ్రాస్ అంజాన్ స్వరకల్పన చేశారు. సెప్టెంబర్ న ఈ చిత్రం విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. పాట పల్లవి కూడా పూర్తిగా వినిపించని ‘మై హు హీరో తేరా...’ పాట చాలా శ్రావ్యంగా మనసుకు హాయిగా అనిపిస్తుంది. మొత్తానికి బాధను అర్థం చేసుకోవాలంటే... ఆ బాధను అనుభవించిన వాళ్ళకు తెలుస్తుందన్నట్టు సల్మాన్ బాధల్లో ఉన్న వాళ్ళకు తన చేయందించి ఊరట కల్పిస్తున్నాడన్న మాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ