సమంతలోని మరో సరికొత్త యాంగిల్ ఇదే!

April 05, 2016 | 05:44 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Samantha-producer-U-turn-movie-niharonline

సౌత్ లో టాప్ నాయిక కిరీటం తగిలించుకుని ఇటు టాలీవుడ్ లోనూ, అటు కోలీవుడ్ లోనూ అగ్రహీరోలతో నటిస్తూ ఏలుతోంది బేబీ డాల్ సమంత. హీరోయిన్ గానే కాదు సమాజ సేవకి అన్న ట్యాగ్ లైన్ కూడా ఆమె సొంతం. అంతేకాదండోయ్ అడపాదడపా చిన్న చిన్న చిత్రాలకు ఆడియోలకు హజరవ్వటం, కొన్నింటికి అయితే ఏకంగా ప్రమోషన్ చేస్తూ వాటి విజయంలో భాగస్వామిగా మారుతోంది ఈ చెన్నై సోయగం. ఇప్పటిదాకా ఈ యాంగిల్ లోనే మనకు తెలిసిన సామ్ త్వరలో మరో కొత్త అవతారం ఎత్తనుందని సమాచారం.

                                 కన్నడలో మిస్టీరియస్ థ్రిల్లర్ గా రూపొందిన బ్లాక్ బస్టర్ అయిన చిత్రం 'యూ టర్న్'. దీనిని త్వరలో  తెలుగు .. తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో, సమంతా నటించనున్నట్టు ఇటీవల వార్తలు షికారు చేశాయి. నాగ చైతన్యతో కలిసి ప్రత్యేకంగా బెంగళూర్ వెళ్లి మరీ సమంత ఈ చిత్రాన్ని చూసి వచ్చిందట. అయితే సినిమా పిచ్చపిచ్చగా నచ్చినప్పటికీ, అందులో సమంత నటించనని ఖరాఖండిగా చెప్పేసిందట. కానీ, చిత్రానికి నిర్మాతగా ఆమె వ్యవహరించేందుకు ముందుకు వచ్చిందని తెలుస్తోంది. నాగ చైతన్య అల్రెడీ హీరోగా కన్ఫర్మ్ కాగా, హీరోయిన్ ఎంపిక పరిశీలనలో ఉంది. పవన్ కుమారే దీనికి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. మరి కథానాయికగా సక్సెస్ అయిన సమంతా, నిర్మాతగా ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతుందో చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ