రజనీకాంత్ రాజకీయాలపై రిపీటే

April 05, 2016 | 05:22 PM | 1 Views
ప్రింట్ కామెంట్
rajinikanth_brother_Satyanarayanarao_political_entry_niharonline

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి కాల్చుకోవటమే తప్ప దీర్ఘకాలం రాణించింది లేదని పలు సందర్భాలలో రుజువైంది. ఓ మోస్తరు వారే కాదు, స్టార్ స్టేటస్ ఉన్న హీరోలు సైతం ఇందుకు అతీతమేం కాదు. రాజకీయాల్లోకి వచ్చి పెద్ద తప్పే చేశానని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఎన్నో సార్లు చెప్పటం చూశాం. అంతెందుకు మన మెగాస్టార్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలుసుకదా. కాస్త పంపు కొడితే చాలు ఎగేసుకుని ఖద్దర్ డ్రెస్సులు వేసుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తుంటారు మన స్టార్లు. కానీ, విపరీతమైన ప్రజాదరణ ఉండి కూడా రాజకీయాల ఉసెత్తని వ్యక్తిగా రజనీకాంత్ ఇప్పటిదాకా ఉండగలిగారు. ఎన్నోసార్లు, ఎన్నోపార్టీలు ఆయనపై ఒత్తిడి చేసినప్పటికీ ఏనాడూ ఆకర్షితులు కాలేకపోయారు. త్వరలో  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి ఆయన రాజకీయ రంగప్రవేశంపై చర్చ జరుగుతోంది.  

అయితే, రజనీ ఎప్పట్లా రాజకీయాలకు దూరంగానే వున్నారంటున్నారు ఆయన సోద‌రుడు సత్యనారాయణ. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయ‌న ఈ విషయమై స్పందించారు. త‌న సోదరుడిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు. 66ఏళ్ల వ‌య‌సులోనూ ర‌జ‌నీ హ్యాపీగా జీవితాన్ని గ‌డిపేస్తున్నార‌ని, ఏ పార్టీ తరఫునా ప్రచారంలో  పాల్గొన‌బోర‌ని ఆయన తెలిపారు. తమిళ రాజకీయ నేతలంతా అవకాశవాదులని, రజనీ రాజకీయాల్లో ఇమడలేడని అన్నారు. పద్మ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో ఆయన బీజేపీ తరపున ప్రచారం చేస్తారని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ‌తంలోనూ ర‌జ‌నీ రాజ‌కీయ ఆరంగేట్రంపై ఆయన సోద‌రుడు సత్యనారాయణ ఇదే విధంగా స్పందించారు కూడా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ