కొన్ని సినిమాల్లో ఈ హీరోయిన్ ఎందుకున్నట్టు? అని ప్రశ్నించుకుంటే కేవలం అందాలు చూపించి, రెండు మూడు పాటలకు స్టెప్పులేయడానికి అన్నట్టే ఉంటున్నాయి సినిమాలో హీరోయిన్ రోల్స్. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు ఈ ఫీలింగ్స్ ను వెలిబుచ్చుతున్నారు. అననయితే అంటున్నారు గానీ... ఎక్కువ డబ్బిచ్చేసరికి మళ్ళీ అలాంటి పాత్రల్లో చేసేస్తున్నారు. పైగా హీరో స్టార్ డం కు కూడా లొంగిపోతున్నారు. సమంత తమిళ అమ్మాయే అయినప్పటికీ ఏం మాయ చేసావె సినిమాతో పెద్ద హిట్ కొట్టి తెలుగులో చాలా ఆఫర్లు దక్కించుకుంది. వరుసగా స్టార్ హీరోల సరసన చాలా సినిమాలు చేసింది. అలా కెరీర్ ప్రారంభంలోనే ఎన్.టి.ఆర్, మహేష్ బాబు, రాజమౌళిల సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయ్యింది. ఈ మధ్య తెలుగులో సినిమాలు తగ్గించినప్పటికీ... తమిళంలో పెద్ద స్టార్ల పక్కన చేసేస్తోంది. ఓ ఇంటర్నేషనల్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ప్రస్తుతం నేను గ్లామర్, ఐదు పాటలకి పరిమితం అయిన సినిమాలను ఒప్పుకోవడం లేదు. హీరోయిన్ గా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఒప్పుకుంటున్నాను. నా దర్శకులు కూడా అలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ ఒకవేళ అలా జరగని రోజు నేను సినిమాల నుంచి రిటైర్ అవుతాను’’ అంటోంది. తనకు పెద్ద అచీవ్ మెంట్ అంటే తనకు చేసిన హీరోలతోనే, దర్శకులతోనే మళ్ళీ మళ్ళీ సినిమాలు చేసే ఛాన్స్ రావడం అని అంటోంది. సమంత తెలుగులో ఇప్పటికే నాగ చైతన్యతో మూడు సినిమాలు చేసింది, మహేష్ బాబుతో రెండు ఒక సినిమాలో మళ్ళీ చేయబోతోంది. అలాగే ఎన్.టి.ఆర్ తో రెండు, సూర్య, ధనుష్ లతో రెండేసి సినిమాలు చేసింది. తన నటన, లక్, తన బిహేవియర్ బాగుండడం వల్లనే కదా తనకు మళ్ళీ మళ్ళీ ఆఫర్ ఇస్తున్నారని తన ఉద్దేశం... అదే తన అచీవ్ మెంట్ గా చెప్పుకుంటోంది.