వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ ఇప్పుడు ఓ కామెడీ సినిమా ‘బీరువా' ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రం ద్వారా సందీప్ కిషన్ డిస్ట్రిబ్యూటర్ అవుతున్నాడట. ‘బీరువా' చిత్రానికి సంబంధించి గుంటూరు ఏరియా రైట్స్ తనే కొనుగోలు చేసాడు. సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ అని, మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉందని, అందుకే గుంటూరు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను కొనుగోలు చేసానని సందీప్ కిషన్ చెప్పుకుంటుంటే, ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తరువాత రిలీజైన ‘రా రా కృష్ణయ్య', ‘జోరు' చిత్రాలు సరిగా ఆడక పోవడం వల్ల ‘బీరువా' బిజినెస్ కాస్త డల్ అయినందున గుంటూరు రైట్స్ తనే కొనుగోలు చేసాడని అనుకుంటున్నారు. ఈ సినిమాపై సందీప్ కిషన్ చాలా హోప్స్ తో ఉన్నాడు. ఉషాకిరణ్ ఫిలిమ్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రానికి 'సంజుగాడి ఫ్రెండ్..' అనేది ఉపశీర్షిక. సందీప్‌కిషన్, సురభి జంటగా నటించారు. కణ్మణి దర్శకుడు. రామోజీరావు నిర్మాత. ఉషాకిరణ్ మూవీస్ లో ఆరోగ్యకరమైన కామెడీ ఉంటుందనేది ఒకప్పటి టాక్. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం నవ్వించగలదో చూడాలి.